హైదరాబాద్, వెలుగు: ప్రజాదరణ కంటే రాజ్యాంగ బాధ్యతే ముఖ్యమని జస్టిస్ టి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. తాను రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను మనస్సాక్షికి అనుగుణంగా, చేసిన ప్రమాణానికి కట్టుబడి నిర్వర్తించానని వెల్లడించారు. సోమవారం జస్టిస్ టి.వినోద్‌కుమార్ రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోశీ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తన న్యాయప్రస్థానంలో సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జస్టిస్ వినోద్‌కుమార్ న్యాయరంగానికి అందించిన సేవలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోశీ, అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రశంసించారు.
రెండు హైకోర్టుల్లో కలిపి ఆయన 13,213 ప్రధానకార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్స్ తేరా రజనీకాంత్‌రెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, న్యాయవాదులు, జస్టిస్ వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ హాలులో అధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
